![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -659 లో..... కార్తీక్ ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని జ్యోత్స్న కచ్చితంగా చెప్తుంది. దాంతో సుమిత్ర తనపై కోప్పడుతుంది. బావకి నేను ఇష్టం లేనని ముందు చెప్పాలి కదా అని జ్యోత్స్న అంటుంది. నాకు కార్తీక్ లండన్ నుండి వచ్చాకే చెప్పాడు కానీ ఆ విషయం మీతో చెప్పమని అన్నాడు కానీ కాంచన, దశరథ్ దగ్గర తన కూతురిని కార్తీక్ కి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట తీసుకున్నాడు. ఎక్కడ ఈ కుటుంబాలు విడిపోతాయోనని అలోచించి ఈ విషయం చెప్పలేదు.. ఆ తర్వాత దీపని పెళ్లి చేసుకున్నాక ఏం జరిగిందో అంతా తెలుసు కదా అని పారిజాతం అంటుంది.
మీరు నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ నష్టపోయింది నేను అని జ్యోత్స్న అంటుంది. ఒక తల్లిగా చెప్తున్నా నువ్వు చేస్తుంది తప్పు.. ఇంకొకసారి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటానంటే నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తానని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత థాంక్స్ రా కార్తీక్.. జ్యోత్స్న మనసులో ఏముందో తెలిసేలా చేసావని శివన్నారాయణ అనగానే నాకు కాదు పారుకి చెప్పాలని కార్తీక్ అంటాడు. ఇద్దరికి థాంక్స్ అని శివన్నారాయణ చెప్తాడు. థాంక్స్ రా కార్తీక్ అని సుమిత్ర చెప్తుంది. ఇప్పుడు మనం అందరం కలిసి నెల రోజుల్లో జ్యోత్స్నకి పెళ్లి చెయ్యాలని కార్తీక్ చెప్తాడు. మరొకవైపు స్వప్న ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తానని అంటుంది. దానికి వద్దని శ్రీధర్ అంటాడు. నాకు నచ్చినట్లు బ్రతకనివ్వరా అని స్వప్న అంటుంది. ఇప్పుడు జ్యోత్స్నని వైరా కిడ్నాప్ చేసాడు. అలా నిన్ను ఎవరైనా చేస్తే నేను తట్టుకోలేనని శ్రీధర్ ఎమోషనల్ అవుతాడు.
ఆ తర్వాత దీప దగ్గరికి సుమిత్ర వచ్చి.. జ్యోత్స్న తరుపున సారీ చెప్తుంది. మరొకవైపు కార్ లో శ్రీధర్ వెళ్తుంటే తనకి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అప్పుడే అటుగా వెళ్తున్న ఒకతను జ్యోత్స్నకి గిఫ్ట్ షాప్ లో తనకి నచ్చిన బొమ్మని ఇవ్వమంటే ఇవ్వలేదు.. ఆ అబ్బాయి కార్ లో ఉన్న శ్రీధర్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. శ్రీధర్ ఫోన్ ద్వారా కార్తీక్ కి విషయం చెప్తాడు. కార్తీక్ హాస్పిటల్ కి వెళ్తాడు. శ్రీధర్ తో మాట్లాడతాడు. నిన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసిన వాళ్ళు ఎక్కడ అని కార్తీక్ వెళ్తుంటే అతనే ఎదురుపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |